Viral News: మీరు చనిపోయారుగా.. హాస్పిటల్‌లో మహిళకు వింత అనుభవం!
Viral News: స్కానింగ్ చేయించుకుందామని హాస్పిటల్‌కి వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఆమె నాలుగు నెలల క్రితమే చనిపోయిందని రికార్డుల్లో ఉందని వైద్యులు చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని బ్రిడ్లింగ్టన్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లైన ఆ మహిళ అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో స్కానింగ్ చేయించుకుందామని ఆ హాస్పిటల్‌కు వెళ్లి వైద్యుల్ని కలవగా.. మీరు నాలుగు నెలల క్రితమే చనిపోయారుగా అని చెప్పారట. ఆ తర్వాత అన్ని రికార్డులు పరిశీలించగా పొరపాటుగా వేరే పేషెంట్ వివరాలు నమోదు చేయబోయి ఆ మహిళ వివరాలు ఎక్కించేసారు. దాంతో ఆమె హాస్పిటల్‌లో నానా హంగామా చేసింది.