Viral News: వామ్మో.. ఇలా కూడా పగ తీర్చుకుంటారా?
Viral News: ప్రియుడు లేదా ప్రియురాలు మోసం చేస్తే వారిపై దాడులు చేయడం.. వారి వ్యక్తిగత ఫోటోలు బయటపెట్టడం వంటి పనులు చేస్తుంటారు. కానీ ఓ యువతి ఏం చేసిందో తెలిస్తే మీరు ప్రేమించడానికి కూడా భయపడతారేమో..! పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అవా లూయిస్. అమెరికాకు చెందిన మోడల్. ఈమెకు ప్రియుడు ఉన్నాడు. అయితే అతను తనను మోసం చేస్తున్నాడని తెలీడంతో కేసులు పెట్టడం, కొట్టడం, ఏడవటం వంటి కాకుండా ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది.
ఎలాగా అని ప్లాన్ వేస్తుండగా.. ఓసారి తన ప్రియుడు తనకు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఆ విషయం ఏంటంటే.. అతను వ్యాపారం చేస్తూ డాలర్లు సంపాదిస్తున్నాడు కానీ ట్యాక్సులు మాత్రం ఎగ్గొడుతున్నాడట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో అతను అవాకు చెప్పాడు. ఈ విషయం అవాకు గుర్తొచ్చి వెంటనే అమెరికాకు చెందిన ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అయిన ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్‌కు ఫిర్యాదు చేసింది. వారు అవా ప్రియుడి ఇంట్లో రైడ్లు నిర్వహించడంతో కట్టల కొద్ది డాలర్లు బయటపడ్డాయి. సమాచారం ఇచ్చినందుకు అవాకు రూ.83 లక్షలు ఇచ్చారు. దెబ్బ అదుర్స్ కదూ..!