“నా చెల్లికి ముద్దు పెట్టి అది చీటింగ్ కాద‌ని అంటున్నాడు”

Viral News: త‌న చెల్లెలికి ముద్దు పెట్టి పైగా అది చీటింగ్ కాదు క్యాజువ‌ల్‌గా పెట్టాన‌ని అంటున్నాడంటూ ఓ మ‌హిళ త‌న బాధ‌ను సోష‌ల్ మీడియాలో వ్య‌క్తం చేసింది. త‌న భ‌ర్త, త‌న చెల్లెలు క‌లిసి ఓ సారి తాగుతుండ‌గా.. వారిద్ద‌రూ ముద్దు పెట్టుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని త‌న భ‌ర్తే స్వ‌యంగా వెల్ల‌డించిన‌ట్లు ఆ మ‌హిళ చెప్పింది. అయితే అది ప్రేమ‌తో పెట్టింది కానీ.. ఆ స‌మ‌యంలో అలా జ‌రిగిపోయింద‌ని చెప్పి సారీ చెప్పిన‌ట్లు వెల్ల‌డించింది. ఇంతా చేసి ఇది చీటింగ్ మాత్రం కాదు అని త‌న భ‌ర్త వాదిస్తున్నాడ‌ట‌. ఈ విష‌యం విన్నాక త‌న భ‌ర్తతో క‌లిసి ఉండాల‌ని అనుకోవ‌డం లేద‌ని.. ఏం నిర్ణ‌యం తీసుకోవాలో త‌న‌కు స‌ల‌హా ఇవ్వాల‌ని కోరుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

దాంతో చాలా మంది నెటిజ‌న్లు ఆ మ‌హిళ ప‌ట్ల సానుభూతి చూపిస్తున్నారు. ఇలాంటి భ‌ర్త‌ల‌తో క‌లిసి ఉండ‌టం కంటే విడిపోవ‌డ‌మే మంచిద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. ఇది చీటింగ్ కాక‌పోతే ఇంకేటట అంటూ ఆమె భ‌ర్త‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో చాలా మంది ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ జీవితాల్లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను సోష‌ల్ మీడియాలో వెల్ల‌డిస్తూ నెటిజ‌న్ల‌ను స‌ల‌హా అడుగుతున్నారు. ఈ విష‌యాల‌న్నీ న‌లుగురికీ తెలిస్తేనే స‌మాజంలో ఎవరు ఎలా ఉంటున్నారో అవ‌గాహ‌న క‌లుగుతుంద‌ని వారు భావిస్తున్నారు.