నెలలో మూడుసార్లు చనిపోతాను..!
Hyderabad: పై ఫొటోలో కనిపిస్తున్న మహిళను చూసారా.. ఈమె నెలలో మూడు సార్లు చనిపోయి మళ్లీ బతుకుతుందట. అంతేకాదు ఇప్పటికే చాలా సార్లు ఏసు ప్రభువు(jesus)ను కలిసిందట. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోందేంటి అనుకుంటున్నారా? కానీ తాను చెప్పేది మాత్రం నిజమేనని బల్లగుద్ది మరీ చెప్తోంది. ఈమె పేరు బెవర్లీ గిల్మోర్. వయసు 57. బెవర్లీకి 20 ఏళ్ల వయసులో ఓ ప్రమాదం జరిగింది. దాంతో ఆమె బ్రెయిన్ దెబ్బతింది. అప్పటినుంచి నెలలో మూడుసార్లు విచిత్రమైనవి తనకు కనిపిస్తుంటాయని చెప్తోంది. కోమాలో ఉన్నట్లే అనిపిస్తుంది కానీ తనకు తన గుండె ఆగిపోయిన విషయం కూడా స్పష్టంగా తెలుస్తుందట. ఇలా తనకు నెలలో మూడు సార్లు జరుగుతూ ఉంటుందని, ఇప్పటికే చాలా సార్లు ఏసు ప్రభువును కూడా కలిసానని తెలిపింది. ఆ సమయంలో తను చనిపోయినవారితో కూడా మాట్లాడుతుంటుందట. అలా మళ్లీ మామూలు స్థితిలోకి వచ్చాక ఎవరెవరిని చూసిందో, వారితో ఏం మాట్లాడిందో అన్నీ ఒక డైరీలో రాసుకుంటుందట.
“నేను చెప్పేది విని అందరూ పిచ్చిది అనుకుంటారు. కానీ నేను అబద్ధం చెప్పడంలేదు. నాకు బ్రెయిన్ ట్రౌమా ఉన్నందుకు ఇలా జరుగుతోంది. కావాలంటే డాక్టర్లను అడిగి తెలుసుకోండి. నేను చచ్చిపోయిన అమ్మానాన్నలను కూడా కలిసాను. నాన్న చనిపోయాక నేను ఆయన్ని మళ్లీ కలిసినప్పుడు ఆయన వయసు 52. రెండోసారి కలిసినప్పుడు ఆయన వయసు 30. మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిసి నేనూ హ్యాపీగా ఫీలయ్యాను. నా కండీషన్ ఏంటో తెలుసుకోవడానికి బెల్జియంలోని ఓ యూనివర్సిటీ సైంటిస్టులు, డాక్టర్లు రీసర్చ్ చేస్తున్నారు” అని తెలిపింది.