జాతీయ జెండా గీయ‌లేక ఇంట‌ర్వ్యూ నుంచి వెళ్లిపోయిన యువతి

a woman lost interview as she could not draw national flag

National Flag: సాధార‌ణంగా ఇంట‌ర్వ్యూల్లో ప్ర‌తిభకు సంబంధించిన ప్ర‌శ్నలు.. నైపుణ్యాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు వేస్తుంటారు. నిజ జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగానూ కొన్ని ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతుంటాయి. కానీ ఐటీ ఉద్యోగం కోసం ఓ ఇంట‌ర్వ్యూకి వెళ్లిన యువ‌తికి విచిత్ర సంఘ‌ట‌న ఎదురైంది. ఆ యువ‌తికి జావా, CSS, యాంగుల‌ర్, html వంటి కోడింగ్ లాంగ్వేజెస్‌లో ప‌దేళ్ల అనుభ‌వం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇంటి ద‌గ్గ‌రే ఉన్న కంపెనీలో ఉద్యోగానికి వెళ్లింది. అక్క‌డ ఆ యువ‌తికి విచిత్ర సంఘ‌ట‌న ఎదురైంది.

CSS కోడింగ్‌లో జాతీయ జెండాను గీసి చూపించాల‌ని ఇంట‌ర్వ్యూలో అడిగార‌ట‌. త‌న‌కున్న అనుభ‌వంతో గీసి చూపించింది. ఆ త‌ర్వాత అశోక చ‌క్ర‌ను వేసి చూపించ‌మ‌న్నార‌ట‌. అది కూడా వేసింది. ఆ అశోక చక్రాలో ఉండే గీత‌లు మిస్స‌య్యాయ‌ని.. వాటిని కూడా వేయాల‌ని చెప్పార‌ట‌. ఇంత వ‌ర‌కు జాతీయ జెండాను గీసిన ఆ యువ‌తి గీతలు మిస్స‌య్యాయి అన‌గానే ఇదేం చెత్త కంపెనీ.. ఇలాంటివా అడిగేది.. అంటే ఇంట‌ర్వ్యూ నుంచి వెళ్లిపోయింద‌ట‌. ఈ విష‌యాన్ని ఆ యువ‌తే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే.. ఈ పోస్ట్ పెట్ట‌గానే ప్ర‌శంస‌ల క‌న్నా తిట్లే పాపం ఎక్కువ‌గా ప‌డ్డాయి ఆ అమ్మాయికి. ఒక జాతీయ జెండాను గీసే స‌త్తా లేక ఇంట‌ర్వ్యూ నుంచి వెళ్లిపోయింది గాక మ‌ళ్లీ ఏదో పెద్ద ఘ‌న‌కార్యం చేసిన‌ట్లు పోస్ట్ పెడ‌తావా అంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేసారు.