Viral News: కేవ‌లం పేర్లు రాస్తూ.. 30 వేలు సంపాదించేస్తోంది

a woman is earning 30k just by writing names

Viral News: డ‌బ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉంటాయంటారు. కానీ ఎలా అనేది చాలా త‌క్కువ మందికి తెలిసి ఉంటుంది. ఆ మార్గం ఏదైన‌ప్ప‌టికీ క‌ష్ట‌ప‌డాల్సిందే. కానీ ఓ అమ్మాయి మాత్రం అస‌లు క‌ష్ట‌ప‌డ‌కుండా వేల‌కు వేలు సంపాదించేస్తోంది. అదేదో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ సంపాదిస్తోందా అంటే కాదు. కేవ‌లం ఇతరుల పేర్లు ఓ పేప‌ర్‌పై రాసి సంపాదించేస్తోంది. జ‌స్ట్ పేరు రాస్తే డ‌బ్బులు ఎలా వ‌స్తాయి అనుకుంటున్నారా? ఆ అమ్మాయి ఇత‌రుల పేర్ల‌ను చేత్తో రాయ‌దు. కాలితో రాస్తుంది.

అమెరికాకి చెందిన ఓ అమ్మాయి ప్లానే ఇది. అస‌లు ఈ ఐడియా త‌న‌కు ఎలా వ‌చ్చిందో కానీ. ఓసారి కాలి వేళ్ల‌తో స్కెచ్ పెన్న‌తో పేప‌ర్‌పై పేరు రాస్తూ దానిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇలా ఎవ‌రైనా పేరు రాయించుకోవాల‌ని అనుకుంటే 300 డాల‌ర్లు ఇవ్వాల్సిందే. నా పేరు రాసి పంపు అని చాలా మంది నుంచి రిక్వెస్ట్‌లు వ‌స్తున్నాయంట‌. అలా ఆ అమ్మాయి 25 నుంచి 600 డాల‌ర్ల వ‌ర‌కు సంపాదించేస్తోంది. ఆ డ‌బ్బుతో త‌న స్కూల్ ఫీజు, ఇంటి రెంట్ క‌ట్టేసుకుంటోంద‌ట‌. ఆ అమ్మాయి అలా పేర్లు రాస్తుంటే త‌న‌కు సంతృప్తి ఉంటుందేమో. కానీ ఇలా రాయించుకుంటూ డ‌బ్బులు చెల్లించుకుంటున్న‌వారికి ఇదేం ఆనందమో ఏమో..!