ఐదుగురితో ఎఫైర్.. గర్భం దాల్చి.. అమాయకుడ్ని ఇరికించి..
Viral News: ఓ తెలుగు ప్రాంతంలో జరిగిన ఘోరం ఇది. ఎక్కడ ఏంటి అనే వివరాలు ఇంకా పోలీసులు వెల్లడించలేదు. ఓ వ్యక్తి ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళితే.. ఒకే గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు సిటీకి వెళ్లారు. వారు చదువు కోసం వెళ్లారో లేక ఉద్యోగం కోసం వెళ్లారో తెలీదు కానీ.. ఆ అమ్మాయి అబ్బాయి కంటే పెద్దది. వీరిద్దరూ ప్రేమికులు కారు కానీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కాన్సెప్ట్‌ని ఫాలో అవుతున్నారు. అంటే ఫ్రెండ్స్‌తో సెక్స్ వంటివి చేయడం. అయితే సిటీలో ఆ అమ్మాయికి ఆ అబ్బాయే కాకుండా మరో ఐదుగురితో ఎఫైర్ ఉందట. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి గర్భం దాల్చింది.
సిటీలోనే పిల్లాడిని కనేసింది. కానీ ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలీదు. ఎఫైర్ పెట్టుకున్నవారంతా ఆ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసి తప్పించుకున్నారు. కానీ అమ్మాయితో పాటు సిటీకి వెళ్లిన అబ్బాయిది ఒకే గ్రామం కావడంతో అందరికీ అనుమానం ఆ అబ్బాయి మీదే కలిగిందట. దాంతో ఆ అమ్మాయి కులం వారంతా అబ్బాయే నిందితుడు అంటూ గ్రామంలో నానా రచ్చ చేసారు. ఈ నేపథ్యంలో ఆ అబ్బాయి తన తల్లిదండ్రులను తీసుకుని వేరే ప్రాంతానికి పారిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ అబ్బాయి తల్లికి యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్లు పోయాయి. ఆ అబ్బాయి పారిపోయాడని తెలిసి ఆ అమ్మాయి ఆట్రాసిటీ కేసు పెట్టింది. దాంతో తన తప్పులేదు అంటున్నా వినిపించుకోకుండా పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
పెళ్లి చేసుకుంటేనే కేసు విత్‌డ్రా చేసుకుంటానని.. తనకు డబ్బులు వద్దని ఆ అమ్మాయి చెప్పింది. ఇందుకు ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ బిడ్డకు తండ్రి తాను కాదని వారిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ అబ్బాయి పోలీసులతో తనకు ఆ బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయాలని కోరాడు. ప్రస్తుతం పోలీసులు ఇదే పనిలో ఉన్నారు. కాబట్టి.. అమ్మాయైనా అబ్బాయైనా తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు.. తెలీని వారితో డేటింగ్‌లకు వెళ్లడాలు వంటివి చేయకండి. ఈ డేటింగ్‌లు ఒకప్పుడు బాగుండేవి. ఇప్పుడు డేటింగ్‌ల పేరుతో ఓయోల చుట్టూ తిరిగేస్తున్నారు. జాగ్రత్త ఫ్రెండ్స్..!