Viral News: 69 మందికి జన్మనిచ్చిన మహిళ..!
Viral News: ఒక మహిళ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 69 మంది శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. అయితే ఇది ఇప్పటి మాట కాదులెండి. 18వ శతాబ్దంలో జరిగింది. రష్యాకు చెందిన ఫియోడోర్ అనే వ్యక్తి వాసిల్యేవా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఏకంగా 69 మందిని సహజ పద్ధతిలోనే కన్నాడట.
అయితే ఒక్కో కాన్పులో 69 మందిని కనలేదు. వసిల్యేవా 27 సార్లు గర్భం దాల్చింది. కొన్ని కాన్పుల్లో 16 మంది కవలలు, 7 మంది ట్రిప్లెట్స్ (ముగ్గురు కవలలు), 4 సార్లు క్వాడ్రూప్లెట్స్ (నలుగురు కవలలు)కు జన్మనిచ్చింది.
ఒక మహిళ ఎంత మందికి జన్మనివ్వచ్చు?
మహిళ అండాశయంలో 1 నుంచి 2 మిలియన్ అండాలు ఉంటాయి. ఇవి వయసు పెరిగే కొద్ది తగ్గుతూ ఉంటాయి. దాదాపు పిల్లల్ని కనే వయసు వరకు 400 నుంచి 500 సార్లు అండోత్సర్గం అవుతుంది. 12 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు అమ్మాయిలకు పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 30 నుంచి 40 మంది పిల్లల్ని కనే అవకాశం ఉంది.
40 కంటే ఎక్కువ మందిని కంటున్నారంటే దానిని హైపర్ ఓవ్యులేషన్ అంటారు. అంటే నెలసరి సమయంలో ఒక అండం కంటే ఎక్కువ అండాలు విడుదల అవుతాయన్నమాట. దీని వల్ల ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు, నలుగురు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. హపర్ ఓవ్యులేషన్ ఉందో లేదో తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ చేస్తారు. దీంతో పాటు హార్మోన్ బ్లడ్ టెస్టులు కూడా చేస్తారు. ఇక 68 మంది పిల్లల్ని కన్న వాసిల్యేవా విషయానికొస్తే అత్యధిక శిశువులకు జన్మనిచ్చిన ఏకైన మహిళగా గిన్నీస్ రికార్డులకు ఎక్కింది.