బిడ్డ పక్కనే ప్రపంచంలోనే డేంజరస్ పాము.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
Viral News: ఓ చిన్న జెర్రి పిల్ల కనిపిస్తేనే గుండె ఆగినంత పనవుతుంది. అలాంటిది ప్రపంచంలోనే రెండో అతి విషపూరితమైన పాము ఇంట్లో కనిపిస్తే? ఓ తల్లికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అది కూడా తన మూడేళ్ల కుమార్తె గదిలో ఈ పాము కనిపించడంతో ఆమె గుండె ఆగినంత పనైంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.
ఆ తర్వాత ఆమె వెంటనే ఆస్ట్రేలియాకు చెందిన ఫేమస్ స్నేక్ హంటర్ మార్క్ పెల్లే అనే వ్యక్తిని ఇంటికి పిలిపించి ఆ పామును పట్టించింది. లేదంటే తన బిడ్డ దక్కేది కాదంటూ ఆ తల్లి మీడియా ముందు కన్నీరుమున్నీరైంది. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను ఓదార్చేందుకు పోలీసులు కొన్ని గంటల పాటు తన ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.