పెళ్లైన 40 రోజులకే విడాకులు.. కారణం తెలిస్తే షాకే
Uttar Pradesh: పెళ్లైన 40 రోజులకే ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుందో తెలుసా? ఆ వ్యక్తి శుభ్రంగా ఉండడని. అవును.. ఆమె భర్త రోజూ స్నానం చేయడు, పళ్లు తోముకోడు, బయటికి వెళ్లొస్తే శుభ్రంగా చేతులు కాళ్లు కడుక్కోడు. ఇలాంటి వ్యక్తుల మధ్య మనం మాత్రం ఉండగలమా? ఎన్నిసార్లు చెప్పినా వినకపోయేసరికి విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది.
ఆగ్రాకి చెందిన రాజేష్ అనే వ్యక్తి కథ ఇది. ఇతను నెలలో ఒకసారి స్నానం చేస్తాడట. అదేంటండీ అని భార్య అడిగితే.. నేనింతే. నేను వారానికి ఒకసారి గంగా జలాన్ని ఒంటిపై చల్లుకుంటాను. నెలకోసారి స్నానం చేస్తాను. అన్నాడట. అది విని భార్య షాకైంది. పెళ్లైన తర్వాత నుంచి 40 రోజుల గ్యాప్‌లో కేవలం 6 సార్లే స్నానం చేసాడు. అది కూడా భార్య దగ్గరికి రానివ్వను అని బెదిరిస్తే. ఇక ఎంత చెప్పినా వినేలా లేడని ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. పైగా కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా కేసు వేసారు.
ఆ తర్వాత భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇప్పించడంతో తన పద్ధతి మార్చుకుంటానని.. ఇక నుంచి శుభ్రంగా ఉంటానని రాజేష్ చెప్పాడు. అయినా కూడా ఆమె వినలేదు. తనకు విడాకులు కావాల్సిందే అని కోరింది. దాంతో మరో రెండు వారాల తర్వాత కౌన్సిలింగ్ సెంటర్‌కు రావాలని ఆదేశించారు.