Company: రిజైన్ చేసి మొత్తం కంపెనీనే ముంచేసింది..!
Company: ఓ ఉద్యోగిని తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి రిజైన్ చేయడమే కాకుండా మేనేజర్ పాస్‌వర్డ్‌ను మార్చేసి మొత్తం కంపెనీ డేటాబేస్‌నే ట్యాంపర్ చేసేసింది. ఈ విషయాన్ని ఆ అమ్మాయే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ అమ్మాయి ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తోంది. కానీ ఆ రెస్టారెంట్‌లో ఆమె తప్ప అందరూ మగవారే. తనను మరీ నీచంగా చూసేవారట.
మర్యాదగా మాట్లాడినా కూడా విసుక్కునేవారట. దాంతో తను చాలా నిరుత్సాహపడింది. అందుకే ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంది. రిజైన్ చేస్తూ మేనేజర్ పాస్‌వర్డ్‌ను మార్చేసింది. దాంతో మొత్తం రెస్టారెంట్‌లోని ఉద్యోగుల లాగిన్ వివరాలన్నీ మారిపోయాయి. రెండు రోజుల పాటు రెస్టారెంట్ ఇబ్బందులు ఎదుర్కొంది. తన పట్ల వారు ప్రవర్తించినదానితో పోలిస్తే తాను చేసింది పెద్ద నేరమేమీ కాదని ఆ అమ్మాయి అంటోంది. మరి మీరేమంటారు? ఆ అమ్మాయి చేసింది కరెక్టా కాదా?