Iraq: వారికి వారే మరణశాసనం రాసుకున్నారు..!
ఇరాక్‌లో (iraq) ఘోరం జరిగింది. ఎంతో ఆనందంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 120 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో వరుడు, వధువు కూడా ఉన్నారు. ఇదేదో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం అంటే పొరపాటే. పెళ్లి వేడుకకు వచ్చిన వారు వరుడు, వధువు ముందే టపాసులు పేల్చారు. దాంతో వెడ్డింగ్ హాల్ మొత్తం అంటుకుపోయింది. మంటలు ఆర్పాలని ప్రయత్నించినా అవి ఎగసిపడుతూనే ఉన్నాయి. అలా కొందరు మంటల్లో కాలిపోయి చనిపోగా మరికొందరు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. అలా వారికి వారే మరణశాసనం రాసుకున్నట్లు అయిపోయింది. (iraq wedding)