Kadapa: ప్రేమ పేరుతో మోసం చేసిన వాలంటీర్
ప్రేమ పేరుతో ఓ యువతిని వాలంటీర్ (ap volunteer) మోసం చేసిన ఘటన కడపలో (kadapa) చోటుచేసుకుంది. కాశినాయన మండలానికి చెందిన మాచవరం చెన్నారెడ్డి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి (22) ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి కూడా వాలంటీరే. యువతికి పెళ్లి కుదిరిందని తెలిసి చెన్నారెడ్డి ఆ అమ్మాయిని సోమవారం బెంగళూర్‌కి తీసుకువెళ్లాడట. బుధవారం తిరిగి అమ్మాయిని తీసుకొచ్చి గ్రామంలో వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆ అమ్మాయి తండ్రి అమ్మాయిని ఇంట్లోకి రానివ్వలేదు. ఏం చేయాలో తెలీక చెన్నారెడ్డికి ఫోన్ చేసింది. అతని స్విచ్ ఆఫ్ రావడంతో ఆ అమ్మాయి చెన్నారెడ్డి ఇంటిముందు బైఠాయించింది.