“ఫ్రెండ్‌నే కదా హగ్ ఇవ్వు అంటున్నాడు”
Real Story: తనకు ప్రియుడు ఉన్నాడని తెలిసి ఓ సహ ఉద్యోగి హగ్ ఇవ్వు.. కలువు అని వేధిస్తున్నాడట. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండండి అంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ సోదరి NewsX కి తన స్టోరీని షేర్ చేసింది. ఆ కథేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
“” హాయ్.. నేను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. నా వయసు 29. నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ల ఇంట్లో వారు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నా కొలీగ్ నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని తెలిసీ నన్ను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను వార్నింగ్ ఇచ్చాను. హే.. నువ్వు కమిటెడ్ అని నాకు తెలుసు. ఏదో సరదాగా ఇలా చేస్తున్నానంతే అని అన్నాడు. ఉద్యోగ రిత్యా అతనితో మాట్లాడకుండా వర్క్ చేయడం సాధ్యం కాని పని. ఎందుకంటే నా డిపార్ట్మెంట్లో అతనొక్కడే ఉన్నాడు. సో.. గొడవలు ఉన్నా లేకపోయినా కలిసే పనిచేయాలి.
అంతా సవ్యంగానే ఉంది అనుకుంటే.. సడెన్‌గా ఓ రోజు రాత్రి 8 గంటలకు మెసేజ్ చేసాడు. నిన్ను మిస్ అవుతున్నాను. ఒక హగ్ కావాలి అని ఆ మెసేజ్‌లో రాసుంది. ఓవరాక్షన్ చేయకు ఇంకోసారి ఇలాంటి మెసేజ్‌లు చేస్తే బాగోదు అని చెప్పాను. దానికి ఆ అబ్బాయి.. హే.. ఎందుకు అంత సీరియస్ అవుతావు. నేను నీతో మంచి ఫ్రెండ్‌లానే ఉందామని అనుకుంటున్నా. ఫ్రెండ్‌గా ఒక హగ్ ఇవ్వమని అడిగా. అది కూడా తప్పేనా? ఫ్రెండ్స్ హగ్స్ ఇచ్చుకోరా అని సమర్ధించుకున్నాడు. (real story)
అతను అప్పుడప్పుడు ఇలా మెసేజ్‌లు చేయడం ఫ్లర్ట్ చేయడం చేస్తుంటాడు కానీ ఏరోజూ కూడా మిస్ బిహేవ్ చేయలేదు. అలాగని అతను మంచివాడని కూడా చెప్పడంలేదు. ఇది నేను హెచ్ఆర్కి చెప్పాను కానీ వాళ్లు లైట్ తీసుకో అనేసారు. నాకు ఈ ఉద్యోగం చాలా ఇంపార్టెంట్. అందుకే ఏమీ చేయలేకపోతున్నాను. ఇదంతా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే.. ఇప్పటికే కొందరు ఆడపిల్లలు తప్పు చేస్తుంటే స్త్రీ జాతి మొత్తాన్ని హేళన చేసి మాట్లాడేవారు ఎక్కువైపోయారు. అలాంటివాళ్లలో నా కొలీగ్ లాంటి అబ్బాయిలు కూడా ఉండే ఉంటారు. బయట సమాజం ఎలా ఉందో మనకు తెలిసిందే. ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితో అన్నట్లుగా ఉంది ఇప్పుడు పరిస్థితి.
ఇలాంటి రోజుల్లో కూడా స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఉంటారు. మీ ఆఫీస్‌లో కానీ కాలేజ్‌లో కానీ మీ మధ్య తిరిగే వారికి ఆల్రెడీ ఒక పార్ట్నర్ ఉన్నారని తెలిస్తే దయచేసి వారితో ఫ్రెండ్షిప్ పేరు చెప్పి నా కొలీగ్లాగా ప్రవర్తించకండి. ఈ సందేశం.. పైకి నీతులు చెప్పి గుడి ఎనక నా సామి పనులు చేసే అబ్బాయిలు, అమ్మాయిలకు మాత్రమే. నన్ను తప్పుగా అనుకోకండి “” —- ఓ సోదరి. (real story)