550 మందికి తండ్రి.. ఇక ఆపేయాలన్న కోర్టు
Hyderabad: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 550 మందికి తండ్రి(spern donor) అయ్యాడు. దాంతో షాకైన కోర్టు ఇక ఆపేయాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటన నెదర్లాండ్స్(netherlands)లో చోటుచేసుకుంది. 41 ఏళ్ల జొనాథన్ జేకబ్ అనే వ్యక్తి వీర్యం డొనేట్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. అలా ఇప్పటివరకు అతను ఏకంగా 550 మందికి తండ్రయ్యాడు. దాంతో ఇప్పుడు ఆ పిల్లలందరూ దాదాపు ఒకే కుటుంబానికి చెందినవారు అవుతారు. 2017 నుంచి జొనాథన్ స్పెర్మ్ డొనేట్ చేస్తున్నాడు. అప్పటికే అతను 100 మందికి తండ్రి అయ్యాడు. నెదర్లాండ్స్ ప్రభుత్వ రూల్ ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు 25 మందిని మాత్రమే వీర్యం డొనేషన్ ద్వారా కనాలి. కానీ జొనాథన్ డబ్బు కోసం ఏకంగా 550 మందికి తండ్రి అయ్యాడు. దాంతో అతనిపై ఓ ఫౌండేషన్ కేసు వేసింది. ఇలా 550 మంది పిల్లలు ఒకరికొకరు తెలీకుండా అన్నలు, చెల్లెళ్లు, అక్కలు, తమ్ముళ్లు అవుతారని, వారు పెద్దయ్యాక తెలీక ఒకరితో ఒకరు ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. దాంతో ఇక జొనాథన్ స్పెర్మ్ డొనేషన్‌కు ఎవ్వరినీ సంప్రదించకూడదని అలా చేస్తే కోటి రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.