ఇక పురుషుల అండం.. మ‌హిళ‌ల వీర్యంతో పిల్ల‌లు..!

సాధార‌ణంగా పురుషుల వీర్యం మ‌హిళ‌ల అండంతో క‌లిస్తే పిల్ల‌లు (kids) పుడ‌తారు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌కృతి ప‌రంగా జ‌ర‌గాల్సిన ప్రక్రియ కూడా ఇదే. కానీ ఇప్పుడు పురుషుల అండం.. మ‌హిళ‌ల వీర్యంతో పిల్ల‌ల్ని పుట్టించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

దీనినే విట్రో గామెటో జెనిసిస్ (vitro gametogenesis) అంటారు. ఈ ప్ర‌క్రియ ద్వారా చ‌ర్మ క‌ణాల‌ ద్వారా అండాశ‌యం, వీర్యంగా మార్చి పిల్ల‌ల్ని పుట్టించే అవ‌కాశం ఉంటుంది. ఈ టెక్నాల‌జీ ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ జంతువుల‌పై ప‌రీక్ష‌లు చేస్తున్నారు. దీంతో పాటు ఇంకో అంశంపై కూడా ప‌రిశోధ‌న జ‌రుగుతోంది. ఇప్పుడు పిల్ల‌లు పుట్ట‌నివారికి IVF ద్వారా పిల్ల‌ల్ని క‌లిగేలా చేసే ఆప్ష‌న్లు బోలెడు ఉన్నాయి. అయితే ఇక్క‌డ కూడా మ‌గాడి వీర్యం, మ‌హిళ అండం కావాలి. కానీ ఇద్దరు మ‌హిళ‌లు లేదా ఇద్ద‌రు పురుషుల నుంచి సేక‌రించిన వీర్యాలు, అండాల‌తో కూడా పిల్ల‌ల్ని పుట్టించ‌డంపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

అయితే ప్రతీ ప‌రిశోధ‌న వెనుక లాభ న‌ష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఈ టెక్నిక్‌ని ఒక‌వేళ లీగ‌ల్ చేసినా కూడా అంద‌రికీ వీలు ప‌డ‌దు. ల‌క్ష‌ల్లో డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సి ఉంటుంది. ఒక వ‌య‌సు దాటిన వారికి ఇది వ‌ర్తించ‌దు. ఎందుకంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వివిధ ర‌కాల చర్మ క‌ణాల‌తో పుట్టించిన వీర్యాలు, అండాల వ‌ల్ల ఒక బిడ్డ‌కు ఒక‌రిద్ద‌రు త‌ల్లులు, తండ్రులు ఉండే అవ‌కాశం ఉంటుంది. దీని వ‌ల్ల ఎవ‌రు ఎవ‌రి బిడ్డ అనే అంశంపై కూడా అభ్యంత‌రాలు వ‌స్తాయి.

అస‌లు కొన్ని విష‌యాలు స‌హ‌జంగా జ‌రిగితేనే బాగుంటుంది. ఐవీఎఫ్‌ల ద్వారా పిల్ల‌ల్ని క‌నేలా చేయ‌డం అనేది మంచి విష‌య‌మే. కానీ దీని నుంచి ఇప్పుడు టెక్నాల‌జీ మ‌రింత ముందు దూసుకెళ్తున్న నేప‌థ్యంలో ప్ర‌కృతికి విరుద్ధంగా కొన్ని ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు.. అమెరికాలో ఓ మ‌గ‌వాడు గ‌ర్భం దాల్చాడు. అస‌లు ఎవ‌రైనా ఊహించారా ఇలాంటివి జ‌రుగుతాయ‌ని. అప్ప‌ట్లో ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ జంబ‌ల‌కిడి పంబ సినిమాలో చూపిస్తే న‌వ్వుకున్నాం కానీ ఇప్పుడు నిజ జీవితంలో జరుగుతుంటే న‌వ్వాలో ఏడ్వాలో అర్థంకాని ప‌రిస్థితి.