Luna 25: కూలిన ర‌ష్యా ల్యాండ‌ర్.. హాస్పిట‌ల్‌లో సైంటిస్ట్

ఇటీవ‌ల ర‌ష్యా (russia) ప్ర‌యోగించిన లూనా-25 (luna 25) ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయింది. దాంతో ఇన్నాళ్లు ప‌డ్డ క‌ష్టం వృథా అయిందేన‌ని బాధ‌ప‌డుతూ ఈ మిష‌న్ చేప‌ట్టిన టాప్ సైంటిస్ట్ మైఖెల్ మారోవ్ (Mikhail Marov) హాస్పిట‌ల్ పాల‌య్యారు. 90 ఏళ్ల మారోవ్ ఈ మిష‌న్‌ను స‌క్సెస్ చేసి క‌న్నుమూయాల‌నుకున్నార‌ట‌. దాదాపు 50 ఏళ్ల త‌ర్వాత చంద్రుడిపై ల్యాండ‌ర్‌ను దించేందుకు రష్యా చేసిన ప్ర‌య‌త్నం చివ‌రిదాకా వ‌చ్చి ఫెయిల్ అయిపోవ‌డంతో ఆయ‌న త‌ట్టుకోలేపోయారు. (luna 25)

ఇప్పుడు మ‌న ఇస్రో (isro) చేప‌ట్టిన చంద్ర‌యాన్ 3 (chandrayaan 3) మిషన్‌లో భాగంగా విక్ర‌మ్ ల్యాండ‌ర్ (vikram) చంద్రుడికి ద‌క్షిణ ధ్రువం వ‌ద్ద ల్యాండ్ అవ‌బోతోంది. ఇండియాతో పాటే ర‌ష్యా కూడా ఈ మిష‌న్‌ను ప్రారంభించింది. అన్నీ బాగుండి ఉంటే.. జాబిల్లికి ద‌క్షిణం వైపు ల్యాండ్ అయిన మొద‌టి వ్యోమ‌నౌకగా లూనా 25 (luna 25) రికార్డ్ సృష్టించేది. ఇప్పుడు మ‌న విక్ర‌మ్ ఈ రికార్డ్‌ను నెల‌కొల్ప‌బోతోంది.