Viral News: ఆత్మ‌హ‌త్య చేసుకున్న రోబో క‌థ‌..!

a robot committed suicide in south korea

Viral News:  మ‌నుషులు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న ఘ‌ట‌న‌ల గురించి రోజూ వింటూనే ఉన్నాం. కానీ రోబో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ ఘ‌ట‌న ద‌క్షిణ కొరియాలో చోటుచేసుకుంది. స్థానిక గుమి సిటీ కౌన్సిల్‌లో ఓ సంస్థ ఓ రోబోను నియ‌మించుకుంది. అది ఉద‌యం 9 నుంచి రాత్రి 6 వ‌ర‌కు ప‌నులు చేస్తుంది. ఫైల్స్ మోసుకెళ్ల‌డం.. స‌మాచారం అందించడం.. అనౌన్స్‌మెంట్లు చేయ‌డం ఆ రోబో చేసే ప‌ని. అది మ‌నుషుల్లాగే పైకి కిందికి వెళ్లాలంటే ఎస్క‌లేట‌ర్ వాడుతుందట‌.

అయితే నిన్న ఆ రోబో మెట్ల‌పై ముక్క‌లు ముక్క‌లుగా అయిపోయింద‌ట‌. దానిని వెంట‌నే ల్యాబ్‌కు తీసుకెళ్లారు. ఏం జ‌రిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ప‌రిశీలించ‌గా.. అది గింగిరాలు తిరిగిపోతూ మెట్ల‌పై నుంచి దూకేసింద‌ట‌. కాలిఫోర్నియాకు చెందిన బేర్ రోబోటిక్స్ అనే రోబోటిక్ కంపెనీ ఈ రోబోను త‌యారుచేసారు. అయితే రోబో సిస్ట‌మ్‌లో ఏదో స‌మ‌స్య వ‌చ్చి ఇలా జరిగి ఉంటుంది అని చెప్ప‌కుండా అది సూసైడ్ చేసుకుంద‌ని చెప్పారు. దాంతో ఇదో పెద్ద విష‌యంగా మారిపోయింది.