Cosmic Explosion: ఆకాశంలో అద్భుతం.. కంటికి కనిపించనున్న విశ్వ విస్ఫోటనం
Cosmic Explosion: ఆకాశంలో అరుదైన అద్భుతాన్ని మనం కళ్లతో చూడబోతున్నాం. ఇలాంటి విస్పోటనాలు ప్రతి 80 ఏళ్లకు ఒకసారి జరుగుతుంటాయట. ఈసారి 2024లో జరగబోతోంది. జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎప్పుడైనా ఈ విస్పోటనం కనిపిస్తుందని నాసా వెల్లడించింది. ఈ విస్పోటనం పేరు నోవా. ఈ విస్పోటనం దాదాపు భూమి సైజులో ఉండే ఓ వైట్ డ్వార్ఫ్ నక్షత్రం వల్ల జరగబోతోంది. ఓ పెద్ద ఎర్రటి నక్షత్రంలో ఉండే హైడ్రోజన్‌ను ఈ వైట్ డ్వార్ఫ్ నక్షత్రం లాగేసుకుంటుండడం వల్ల ఈ విస్పోటనం జరగబోతోందని నాసా వెల్లడించింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ విస్పోటనం ఏదో ఒకసారి కనిపించి పోయేది కాదట. దాదాపు వారం రోజుల పాటు ఆకాశంలో కనిపిస్తుందని చెప్తున్నారు.