Python: బాత్రూమ్‌కి వెళ్తే మర్మాంగాన్ని చుట్టేసిన కొండచిలువ
Python: బాబోయ్.. ఇలాంటి సంఘటన ఏ ఒక్కరికీ కల్లో కూడా రాకూడదు అనుకుంటాం. కానీ ఓ వ్యక్తికి నిజ జీవితంలో ఎదురైంది. దాంతో ఇప్పుడు ఆ వ్యక్తి ఇంకా షాక్‌లోనే ఉన్నాడు. థాయ్‌లాండ్‌లోని సముట్ ప్రకన్ ప్రాంతానికి చెందిన తనాట్ అనే వ్యక్తి ఉదయాన్నే బాత్రూమ్‌కు వెళ్లాడు. కమోడ్‌పై కూర్చుని తన పని తాను చేసుకుంటుంటే.. తన మర్మాంగం దగ్గర ఉన్నట్టుండి మండుతున్నట్లు అనిపించిందట. ఏంటబ్బా అని చూసుకుంటే 12 అడుగుల కొండచిలువ మర్మాంగానికి వేలాడుతూ కనిపించింది. దాంతో అతని గుండె ఆగినంత పనైంది. కొండచిలువ నుంచి విడిపించుకుందాం అంటే అది మరీ ఉడుంపట్టు బిగించినట్లు పట్టుకుంది. దాంతో తనాట్ కేకలు వేస్తూ టాయ్‌లెట్ బ్రష్‌తో దానిని చావబాదాడు. నొప్పి తట్టుకోలేక అది వదిలేసింది.
ఆ దాడిలో కొండచిలువ అతని వేలుని కాటేసింది. అది తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోగా.. తనాట్ వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. వెంటనే స్థానికుల సాయంతో హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత పాములు పట్టేవారిని పిలిపించి దానిని పట్టించాడు. ప్రస్తుతం తనాట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ షాక్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.