ప్రయాణికుడికి విరోచనాలు.. విమానం అత్యవసర ల్యాండింగ్
Viral News: ఓ ప్రయాణికుడికి విరోచనాలు అవుతుండడంతో 250 మంది ప్రయాణికులతో ఆకాశంలో ఉన్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ట్రాన్స్ అట్లాంటిక్ డెల్టా విమానం అమెరికాలోని బోస్టన్ నుంచి ఇటలీలోని రోమ్‌కు 280 మంది ప్రయాణికులతో ప్రయాణించాల్సి ఉంది. ఆగస్ట్ 30న టేకాఫ్ అయిన గంటకే మళ్లీ అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఇందుకు కారణం ఓ ప్రయాణికుడికి విరోచనాలు అవుతుండడంతో ప్రతి ఐదు నిమిషాలకోసారి బాత్రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అతనికి ఎయిర్ హోస్టెస్‌లు కూడా సాయం చేసారు కానీ.. ఉన్నట్టుండి కూర్చున్న సీటులోనే మలవిసర్జన చేసేయడంతో వెంటనే విమానాన్ని దించేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రయాణికులను వేరే విమానంలోకి ఎక్కించి పంపినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.