613 రోజులు కోవిడ్‌తో పోరాడి మృతిచెందిన వ్యక్తి
Covid: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సృష్టించిన అల్లకల్లోలాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. ప్రపంచాన్ని వణికించిన ఈ కోవిడ్ మహమ్మారి వల్ల మన భారతదేశంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రోగనిరోధక శక్తి బాగా ఉన్నవారు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఓ వ్యక్తి ఈ కోవిడ్ బారిన పడి దాదాపు 613 రోజులు పోరాడి ఈరోజు మృతిచెందాడు.
ఈ ఘటన ఆమ్‌స్టర్‌డ్యాంలో చోటుచేసుకుంది. 2022 ఫిబ్రవరిలో 70 ఏళ్ల వ్యక్తి కోవిడ్ సోకి స్థానిక హాస్పిటల్‌లో చేరాడు. ఎన్ని మందులు ఇస్తున్నా ఎన్ని రకాల చికిత్సలు చేసినా అతనికి కోవిడ్ ఇన్‌ఫెక్షన్ తగ్గలేదు. అత్యధిక వైరల్ లోడ్స్ ఉండటంతో అతను 613 రోజుల పాటు పోరాడాడు. దీంతో పాటు అతనికి క్యాన్సర్ కూడా ఉండటంతో కోలుకోవడం మరింత కష్టం అయ్యింది. దాంతో ఒంట్లో యాంటీ బాడీస్, తెల్ల రక్త కణాలు లేక పోరాడలేకపోయాడు. దాంతో అతను అటు కోవిడ్‌తో ఇటు క్యాన్సర్‌తో పోరాడి ఈరోజు మృతిచెందాడు. కోవిడ్ సోకాక ఇన్ని రోజుల పాటు పోరాడి మరణించిన తొలి వ్యక్తి ఇతనేనట.
ALSO READ:
https://telugu.newsx.com/tag/viral-news/