Hanamkonda: బ‌స్సు హారన్ సౌండ్‌కు బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

a person died in hanamkonda after getting scared of a bus horn

Hanamkonda: హ‌న్మ‌కొండ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. కమలాపూర్ మండలం గుండేడు శివారులోని ఇల్లందకుంట మండలంలో శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్య‌క్తి బైక్ పై వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న బస్సు డ్రైవ‌ర్ హారన్ కొట్టాడు. ఆ హార‌న్ సౌండ్‌కి శ్రీనివాస్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. దాంతో బైక్ అదుపు తప్పి కిందపడటంతో శ్రీనివాస్ తలకు తీవ్ర‌గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.