Kerala Landslides: కేరళ ప్రళయం నుంచి కుటుంబాలను కాపాడిన రామచిలుక
Kerala Landslides: కేరళలో వర్షాల కారణంగా వాయనాడ్ ప్రాంతంలో విలయ ప్రళయం సంభవించిన సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా అక్కడ కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 మంది మృత్యువాతపడ్డారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఓ రామచిలుక కొన్ని కుటుంబాలను ఈ ప్రళయంలో బలి కాకుండా కాపాడింది. వాయనాడ్‌కు చెందిన వినోద్ అనే వ్యక్తి ఓ రామచిలుకను పెంచుకుంటున్నాడు. దాని పేరు కింగిని. జులై 31న వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఆ ప్రళయానికి ముందు చిలుక తెగ అరిచిందట. ఏదన్నా ప్రమాదం సంభవించడానికి ముందు పక్షలు, జంతువులు అలా అరుస్తాయి. ఆ విషయాన్ని పసిగట్టిన వినోద్ వెంటనే తన ఇంటి చుట్టూ ఉన్న నాలుగైదు కుటుంబాలను అలెర్ట్ చేసాడు. దాంతో వారంతా కొండచరియలు విరిగిపడటానికి ముందే వేరే ప్రాంతానికి పారిపోయారు. అలా వారు తమ ప్రాణాలను రక్షించుకోగలిగారు. ఆ చిలుకే లేకపోయి ఉంటే అందరం చనిపోయి ఉండేవాళ్లమని వినోద్ తెలిపాడు.