Driving License Update: డ్రైవింగ్ లైసెన్స్‌లో కొత్త రూల్ ఇదే.. ఇక వారికి కూడా లైసెన్స్ వస్తుంది
Driving License Update: డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ప్రభుత్వం కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు కేవలం 18 ఏళ్లు నిండిన వారికే లైసెన్స్ ఇచ్చేవారు. అయితే ఇక నుంచి 16 ఏళ్ల మైనర్లకు కూడా లైసెన్స్ ఇవ్వనున్నారు. అయితే 16 ఏళ్ల మైనర్లకు లైసెన్స్ లభించినప్పటికీ వారు కేవలం ద్విచక్ర వాహనాలు నడపేందుకు మాత్రమే అర్హులు. ఈ రూల్ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి లాభదాయకం. అయితే.. 16 ఏళ్ల వాహనదారులు డ్రైవింగ్ టెస్ట్‌కి తీసుకెళ్లేటప్పుడు వాహనం 50 CC మాత్రమే ఉండాలి. అది కూడా గంటకు 70 కిలోమేటర్ల వరకే వెళ్లేలా ఉండాలి. ఇక 16, 18 ఏళ్ల వారికి తమ వాహనాల ఇంజిన్ పవర్ 40 KW మాత్రమే ఉండాలి.