Mother: ఏడేళ్ల తర్వాత అడుక్కుంటూ కనిపించిన కొడుకు..తల్లడిల్లిపోయిన తల్లి
Mother: ఓ కన్నతల్లికి ఇంతకంటే కడుపుకోత ఉంటుందా? ఏడేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు రోడ్లపై అడుక్కుంటూ కనిపించడంతో ఆమె చలించిపోయింది. పైగా తన కుమారుడు మానసిక వికలాంగుడు అని తెలిసే ఎత్తుకెళ్లారని తెలిసి ఆమె గుండె పగిలింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది.
ముస్తకీం ఖలీద్ అనే వ్యక్తి 2016లో తప్పిపోయాడు. ఇతను ఒకప్పుడు పోలీస్ శాఖలో పనిచేసాడు. కానీ టైఫాయిడ్ జ్వరం రావడంతో అతను మానసిక వికలాంగుడిలా మారిపోయాడు. అలా 2016లో తప్పిపోయిన వ్యక్తి నిన్న తన తల్లి షహీన్ అక్తర్‌కు కనిపించాడు. షహీన్ చూసినప్పుడు ఖలీద్ బిచ్చమెత్తుకుంటూ కనిపించాడు. పైగా అతనితో పాటు ఉన్న మిగతా బిచ్చగాళ్లు ఖలీద్ మానసిక పరిస్థితిని తెలుసుకుని ఇంజెక్షన్లు ఇచ్చి టార్చర్ పెట్టినట్లు తెలిసింది. దాంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఏడేళ్ల తర్వాత తన కుమారుడిని ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని షహీన్ కన్నరుమున్నీరైంది. ఆమె పరిస్థితి చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి.