Viral News: గుండెపోటుతో కొడుకు.. కొద్ది క్షణాల్లో తల్లి మృతి
Viral News: గుండెపోటుతో కొడుకు మరణించాడనే వార్త తెలీగానే కన్నతల్లి గుండె తట్టుకోలేకపోయింది. కొడుకు చనిపోయిన కొద్ది గంటల్లోనే తల్లి కూడా గుండెపోటుతో మరణించిన ఘటన మెదక్ జిల్లా కుంచన్పల్లి గ్రామంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. నరసింహగౌడ్ (36) అనే వ్యక్తికి ఈరోజు ఉదయం గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతిచెందాడు. బిడ్డ మరణవార్త విని తల్లి లక్ష్మి (57) కూడా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.