Work From Bed: 8 గంటలు నిద్రపోతే 10 లక్షల జీతం
Work From Bed: వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీస్ గురించి విన్నాం. మరి వర్క్ ఫ్రం బెడ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ ఉద్యోగం కావాలని ప్రపంచంలోని 800 కోట్ల మంది ప్రజలు కోరుకుంటారు. ఇంతకీ ఈ ఉద్యోగం ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండీ.. రోజుకు 8 గంటల పాటు నిద్రపోతే రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు స్టైపెండ్ ఇస్తారు. వింటుంటేనే వెంటనే దరఖాస్తు చేసుకోవాలనిపిస్తోంది కదూ..! ఇంతకీ ఈ ఉద్యోగం వివరాలు ఏంటంటే.. ప్రముఖ పరుపుల తయారీ కంపెనీ అయిన వేక్ ఫిట్ ఈ ఉద్యోగాన్ని ప్రకటించింది. రెండు నెలల పాటు తమ దగ్గర ఇంటర్న్‌షిప్ చేసేవారు కావాలని ప్రకటించింది.
ఇంతకీ ఏం చేయాలి?
వేక్ ఫిట్ పరుపుపై రాత్రి కచ్చితంగా 8 గంటలు నిద్రపోయి కంపెనీ వారికి మీకు ఎలా అనిపించిందో వివరించాలి. ఉదయం ఒక 20 నిమిషాల పాటు అదే పరుపుపై నిద్రపోవాలి. అప్పుడప్పుడు నిపుణులు ఏర్పాటు చేసే వర్క్ షాప్స్‌కి హాజరవుతూ ఉండాలి.
అర్హతలేంటి?
రాత్రి ఒకే సమయానికి నిద్రపోయేవారు అయ్యుండాలి
ఎన్ని పనులు ఉన్నా పడుకోమన్న సమయానికి అన్నీ పక్కనపెట్టి పడుకోవాలి
రాత్రి కలలు బాగా కనాలి
వయసు 22 సంవత్సరాలకు పైగా ఉండాలి
ఏ డిగ్రీ అయినా చేసుండాలి. నిద్ర నిద్ర పట్ల ఇష్టం ఉండాలి.
జీతం
రూ.1 లక్ష వరకు స్టైపెండ్ ఇస్తారు. ఒకవేళ చెప్పిన వేళల కంటే బాగా నిద్రపోగలిగితే రూ.10 లక్షల వరకు కూడా ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
వేక్ ఫిట్ సంస్థకు చెందిన లింక్డిన్ పేజీలో వివరాలు ఉన్నాయి. అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు.