America: కారులో అమెరికా టు ఇండియా.. ఖర్చు కోటి!
Hyderabad: ఓ వ్యక్తి అమెరికా(america) నుంచి ఇండియాకు(india) ఏకంగా కారులో వచ్చేసాడు. సాధారణంగా ఇండియా టు అమెరికా అంటే విమానంలోనే వెళ్లాలి. రోడ్ ట్రిప్(road trip)తో అసాధ్యం. కానీ పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి దాన్ని పాజిబుల్ చేసి చూపించాడు. కాకపోతే ఇంత పెద్ద ట్రిప్ చేయడంతో అతనికి తడిసిమోపెడైంది. ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసి మరీ అమెరికా నుంచి ఇండియా వచ్చాడట.
లఖ్విందర్ సింగ్ అనే వ్యక్తి 54 రోజుల క్రితం తన టయోటా టకోమా కారులో అమెరికా నుంచి బయలుదేరాడు. అమెరికాలో డ్రైవర్‌గా పనిచేస్తున్న లఖ్విందర్.. డబ్బు సేవ్ చేసుకుని 60 వేల డాలర్లతో టయోటా టకోమా కారును కొనుక్కున్నాడు. కాలిఫోర్నియాలోని తన ఇంటి నుంచి మొదలైన ట్రిప్ 23 దేశాలు, 22,000 కిలోమీటర్ల ప్రయాణంతో 54 రోజుల్లో ఇండియాకు చేరుకున్నాడు. ఇందుకు అతనికి అయిన ఖర్చు కోటి రూపాయలు. డ్రైవింగ్ అంతా బాగానే ఉన్నప్పటికీ ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి ఎంటర్ అవ్వాలంటే పర్మిట్‌లు కావాలి. వాటి కోసం పడిన కష్టం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటున్నాడు.
అయితే ఆయన 22,000 కిలోమీటర్లు కారులోనే ప్రయాణించలేదు. అమెరికా నుంచి లండన్‌కు ఆ తర్వాత లండన్ నుంచి పారిస్‌కు కారును షిప్‌లో పంపించేసాడు. అయితే తిరిగి అమెరికాకు కారులోనే వెళ్లలేడు కాబట్టి ఈసారి మాత్రం కారును షిప్‌లో పంపించి తను ఫ్లైట్‌లో వెళ్లిపోతానని తెలిపాడు లఖ్విందర్.