Bath With Snakes: పాముల‌తో స్నానం

ఎంత‌టి మొన‌గాడైనా పాములను చూస్తే బిత్త‌ర‌పోతాడు (bath with snakes). చివ‌రికి పాముల్ని ప‌ట్టుకునేవారికి కూడా అవంటే హ‌డ‌ల్. అలాంటిది ఓ వ్య‌క్తి త‌న బాత్రూమ్ నిండా పాముల‌ను పెట్టుకుని వాటి మ‌ధ్య‌లో హాయిగా ష‌వ‌ర్ చేసుకుంటున్నాడు. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు కానీ ఓ వ్య‌క్తి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేయ‌డంతో తెగ వైర‌ల్ అవుతోంది. ఒక పామును మెడ‌లో, మరో పాము ష‌వ‌ర్ పైప్‌పైన పెట్టుకుని వాటితో స‌రదాగా మాట్లాడుకుంటూ ష‌వ‌ర్ చేసేస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్నవారంతా ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేస్తేనే బెట‌ర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (bath with snakes)