ఆ పోలీస్ నీపై మనసుపడ్డాడు అతనితో పడుకో.. లేదంటే..
Viral News: ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి.. పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూనే ఉంటాయి.. ఇది మాత్రం మారేలా లేదు. ఓ పక్క కలకత్తాకు చెందిన డాక్టర్ పట్ల దారుణ సంఘటన చోటుచేసుకుని.. ఆమెకు న్యాయం జరగాలని యావత్ భారతదేశం స్వరం వినిపిస్తుంటే.. మరోపక్క ఇలాంటి సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రేయ్ బరేలీకి చెందిన ఓ యువతి ప్రేమించిన వాడి చేతిలో మోసపోయింది. పిలిభిట్ జిల్లాకు చెందిన ఇక్రార్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. ఆ యువతి కూడా ఇక్రార్‌ను ప్రేమించింది.
కొన్ని రోజుల తర్వాత మా మామయ్య పెళ్లి గురించి మాట్లాడతారంట వెళ్దాం పద అని ఇక్రార్ ఆమెను హోటల్‌కు తీసుకెళ్లాడు. దాంతో ఆమె ఇక్రార్ మాటలు నమ్మి అతని వెంట వెళ్లింది. తీరా వెళ్లాక ఇక్రార్‌తో పాటు అతని మామయ్య కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అసభ్యకరమైన వీడియోలు కూడా తీసారు. అంతటితో ఆగకుండా పాపం ఆ యువతి తల్లిపై అత్యాచారం చేసారు. ఈ విషయం బయటికి చెప్తే వీడియోలు లీక్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
పోనీ అంతటితో వదిలేసారా అంటే.. వారిద్దరి దగ్గరికి వెళ్లి తమకు తెలిసిన ఓ పోలీస్ మనసు పారేసుకున్నాడని.. అతని వాంఛ తీర్చకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. దాంతో వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఈ విషయం స్థానిక కమ్యూనిటీలో పెద్ద రచ్చకు దారి తీయడంతో పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు.