Karnataka: గత జన్మలో ప్రేమికులం అంటూ NRIపై అత్యాచారం
Karnataka: గత జన్మలో మనం ప్రేమికులం. నిన్ను చూసాక నాకు గత జన్మ గుర్తొచ్చింది అంటూ ఓ NRIపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యోగా టీచర్. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చిక్కమగళూరుకు చెందిన ప్రదీప్ ఉల్లాల్ అనే వ్యక్తి యోగా టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను ఆన్‌లైన్ యోగా క్లాసెస్ చెప్తుంటాడు. ఈ క్లాసులకు ఓ ఎన్నారై యువతి కూడా హాజరయ్యేది. ఆమెపై మనసు పారేసుకున్న ప్రదీప్ తియ్యని మాయమాటలు చెప్పి ఏమార్చాడు.
2021, 2022లో ఆ ఎన్నారై యువతి ప్రదీప్‌ను కలిసింది. ఆ సమయంలో పూర్వ జన్మ ప్రేమ అంటూ ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చింది. కానీ అబార్షన్ అయిపోయింది. పెళ్లి చేసుకుందాం అంటే ప్రదీప్ ముఖం చాటేయడంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రదీప్‌పై 376(2)(n) కింద కేసు నమోదు చేసారు. ప్రదీప్ కొన్నాళ్ల పాటు దుబాయ్‌లో ఉండి ఆ తర్వాత చిక్కమగళూరు వచ్చాడు. మూడు ఎకరాల భూమి కొని కేవల ఫౌండేషన్ పేరిట యోగా శిక్షణ ఇస్తున్నాడు.