Viral News: కుటుంబాన్ని చంపేసిన యువకుడు
Texas: “అమ్మానాన్నలు నరభక్షకులు నన్ను తినేయాలనుకున్నారు” అంటూ ఓ యువకుడు కుటుంబాన్నే చంపేసాడు. ఈ వైరల్ (viral news) ఘటన అమెరికాలోని టెక్సాస్ (texas)లో చోటుచేసుకుంది. టెక్సాస్‌కు చెందిన 18 ఏళ్ల సీజర్ అనే యువకుడు తన అమ్మానాన్నలను, చెల్లి, తమ్ముడిని గన్నుతో కాల్చి చంపేసాడు. కేకలు వినిపించడంతో పక్కింట్లోని వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి చూడగా కుటుంబాన్ని చంపేసి వారి వైపు దీనంగా చూస్తూ కూర్చున్నాడు సీజర్. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు చంపావు అని అడగ్గా.. తన తల్లిదండ్రులు, తోబుట్టువులు క్యానిబల్స్ (నరభక్షకులు) అని ఎక్కడ తనని చంపి తింటారోనని చంపేసానని తెలిపాడు. అతని మానసిక పరిస్థితి బాలేదని గమనించిన పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు. ఓసారి సీజర్ చెల్లెలు ఆఫీస్‌కి రాకపోయేసరికి తన ఇంటికి వెళ్లానని, అక్కడ సీజర్ గన్నుతో బెదిరించాడని ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అమెరికాలో ఉన్న గన్ కల్చర్ వల్ల నెలలో దాదాపు ఐదు, ఆరు హత్యలు జరుగుతున్నాయి. అక్కడ నివసిస్తున్న తెలుగువారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.