డబ్బు కోసం నమ్మిన ఫ్రెండ్‌నే కిడ్నాప్ చేసాడు.!
డబ్బు మీద ఆశ మనిషితో ఎంత నీచపు పనైనా చేయిస్తుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. డబ్బు కోసం ఓ వ్యక్తి ఏకంగా నమ్మిన స్నేహితుడినే కిడ్నాప్ (kidnap) చేసాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్‌కి చెంది బబ్లూ యాదవ్ అనే 33 ఏళ్ల వ్యాపారవేత్త యాపిల్స్ కొనుగోలు చేసేందుకు ఏకంగా బెంగాల్ నుంచి ఢిల్లీ వెళ్లాడు. ఢిల్లీలో బబ్లూ స్నేహితుడు అజయ్ ఉండటంతో అతనికి ఫోన్ చేసి టాక్సీ పంపాలని అడిగాడు. ఇదే అదనుగా భావించిన అజయ్ కిడ్నాప్ ప్లాన్ వేసాడు. ఇందుకోసం మరో ఇద్దరి సాయం కూడా తీసుకున్నాడు. బబ్లూ కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి టాక్సీ పంపిన అజయ్.. మార్గ మధ్యలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసారు.
వదిలిపెట్టాలంటే కొంత డబ్బు ఇవ్వాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు. ఇందుకోసం బబ్లూ బంధువులకు ఫోన్లు చేసి రూ.2.7 లక్షలు వివిధ యూపీఐ ఐడీల ద్వారా చెల్లించాలని లేదంటే బబ్లూని వదిలిపెట్టమని బెదిరించారు. అడిగినంత డబ్బు వారు ఇవ్వడంతో బబ్లూని స్థానిక బహదూర్‌గడ్ మెట్రో స్టేషన్ వద్ద దించేసారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని హెచ్చరించి వారు పారిపోయారు. కానీ బబ్లూ ధైర్యంగా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. (kidnap)