పెన్షన్ కోసం 6 ఏళ్లుగా ఇంట్లోనే తల్లి శవం..!
Italy: తల్లి చనిపోయిందని చెప్తే ఎక్కడ పెన్షన్ (pension) రాకుండాపోతుందోనని ఓ వ్యక్తి ఆరేళ్లుగా ఇంట్లోనే శవాన్ని దాచుకున్నాడు. ఈ దారుణ ఘటన (viral news) ఇటలీలో చోటుచేసుకుంది. మారియా అనే 60 ఏళ్ల వృద్ధురాలు ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అయితే ఆమె చనిపోయిందని తెలిస్తే పెన్షన్ ఇవ్వరని భయపడి మారియా కొడుకు మృతదేహాన్ని ప్లాస్టిక్ కవరులో చుట్టి ఇంట్లోనే పెట్టుకున్నాడు. చుట్టుపక్కల వారు అడిగితే బంధువుల ఇంటికి వెళ్లింది అని చెప్పేవాడు. ఆలా ఆరేళ్ల పాటు తల్లి శవాన్ని ఇంట్లో పెట్టుకుని £156,000 అంటే మన కరెన్సీలో 1.59 కోట్లు పెన్షన్ వాడుకున్నాడు. అయితే మారియా ఆరేళ్లుగా ఎలాంటి హెల్త్ కార్డులు వాడకపోవడంతో అనుమానం వచ్చి అధికారులు ఆమె ఇంటికి వెళ్లి చూసారు. ఆ సమయంలో ఇంట్లో మారియా కొడుకు లేడు కానీ ఆమె మృతదేహం బెడ్‌పై ప్లాస్టిక్ కవరులో కనిపించింది. దాంతో ఆమెకు జరగాల్సిన అంత్యక్రియలు పోలీసులనే నిర్వహించారు. పరారీలో ఉన్న మారియా కొడుకు పోలీసులకు ఎదుట లొంగిపోయాడు.