Israel Gaza War: హ‌మాస్ చెర‌లో ప్రేయ‌సి.. విడిపించేందుకు ప్రియుడి క‌ష్టాలు

Israel Gaza War: ఇజ్రాయెల్‌లో జ‌రిగిన సూప‌ర్‌నోవా ఫెస్టివ‌ల్‌కి వెళ్లి హ‌మాస్ చెర‌లో చిక్కిన వారిలో పై ఫోటోలో క‌నిపిస్తున్న అమ్మాయి కూడా ఉంది. ఈ అమ్మాయి పేరు ఇన్బర్ హైమ‌న్ (inbar haiman). ఈ అమ్మాయిని క్షేమంగా వెన‌క్కి ర‌ప్పించ‌డం కోసం ఆమె ప్రియుడు నోవామ్ ఆలోమ్ ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాడు. మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌కి ఇన్బార్ మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌తో వెళ్లింది. వారు త‌ప్పించుకోగ‌లిగారు కానీ ఇన్బార్ హ‌మాస్ చేతికి చిక్కింది. ఆమెను మోట‌ర్ బైకుల‌పై ఈడ్చుకెళ్తుండ‌గా తీసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

అప్ప‌టినుంచి ఆలోమ్ త‌న ప్రేయ‌సిని క్షేమంగా త‌న‌కు అప్ప‌గించాల‌ని ఇజ్రాయెల్ ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఇదంతా ఒక్క ఎత్తైతే.. ఇన్బార్ ఉంటున్న ఇంటి ఓన‌ర్ ఆమె రెంట్ క‌ట్ట‌లేద‌ని.. వారంలో డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే సామాన్లు బ‌య‌ట విసిరేసి వేరేవారికి అద్దెకు ఇచ్చేస్తాన‌ని ఆలోమ్‌ను బెదిరించాడ‌ట. ఇన్బార్ హ‌మాస్ చెర‌లో బందీగా ఉంది అని చెప్పినా కూడా విన‌కుండా అది నాకు అన‌వ‌స‌రం అని కాస్త కూడా క‌నిక‌రం లేకుండా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆలోమ్ తండ్రి మీడియా ద్వారా వెల్ల‌డించారు. బందీలుగా ఉన్న‌వారికి కాస్త నీరు, తిండి పెడితే చాల‌ని.. యూకే, ఇజ్రాయెల్ ప్ర‌భుత్వాలు ఏదో ఒక‌టి చేసి త‌న ప్రేయ‌సితో పాటు అంద‌రినీ వ‌దిలేసేలా వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రిక్వెస్ట్ చేస్తున్నాడు.  (israel gaza war)