ఇంకో 20 ఏళ్లు బతుకుతాడేమోనని తండ్రిని చంపేసాడు!
Bengaluru: ఆస్తి అనుభవించనివ్వకుండా ఇంకో 20 ఏళ్లు బతికేస్తాడేమోనని ఓ రాక్షసుడు కన్నతండ్రినే చంపించాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో(karnataka) చోటుచేసుకుంది. మారథహళ్లి ప్రాంతానికి చెందిన నారాయణ స్వామి అనే భూ వ్యాపారి ఫిబ్రవరిలో దారుణ హత్యకు గురయ్యాడు. దాంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి అతని కొడుకు మణికంఠపై అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. అప్పటికే మణికంఠ మొదటి భార్యను చంపిన కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
విచారణలో మణికంఠ చెప్పిన సమాధానం విన్నాక పోలీసులు షాకయ్యారు. అంత ఆస్తి ఉన్నా కూడా తనను ఎంజాయ్ చెయ్యనివ్వడంలేదని, పార్టీలకు వెళ్లినా, కాస్త డబ్బు కావాలని అడిగినా చులకనగా చూసేవాడని మణికంఠ తెలిపాడు. ఈ వయసులోనూ అతను ఆరోగ్యంగా ఉన్నాడని, మరో 20 ఏళ్లు బతకగలడని అందుకే చంపించానని చెప్పాడు. జైలు నుంచే ఓ ముఠాకు సుపారీ ఇచ్చి తన తండ్రిని చంపించానని ఒప్పుకున్నాడు. ఆ ముఠాలోని వ్యక్తులు నారాయణను చంపేసి పోలీసులకు లొంగిపోయారు.