Kolkata Doctor Rape: నిరసన తెలుపుతుండగా మరో ఘటన.. వైద్యురాలికి మర్మాంగం చూపించిన కామాంధుడు
Kolkata Doctor Rape: ఓ పక్క కలకత్తాలో జూనియర్ డాక్టర్ పట్ల జరిగిన దారుణాన్ని వ్యతిరేకిస్తూ ఇతర వైద్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. అక్కడే మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వైద్యురాలు ధర్నాలో పాల్గొనగా.. ఓ నీచుడు ఆమె వద్దకు వచ్చి ప్యాంట్ విప్పి చూపించడం వంటి వికృత చేష్టకు పాల్పడ్డాడు. వెంటనే వైద్యురాళ్లంతా కలిసి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అక్కడికక్కడే ఆ వ్యక్తిని నిలదీయగా.. అతనో మానసిక వికలాంగుడు అని తెలిసి వదిలేసారు. దాంతో వారు నిరసనను ఉధృతం చేసారు. పెద్ద ఎత్తున గొడవ చేయగా అతనిపై పోలీసులు భారత న్యాయ సన్హిత ప్రకారం సెక్షన్ 79 కింద కేసు నమోదు చేసారు.