Guntur: SI ఫిట్నెస్ టెస్ట్ స‌మ‌యంలో గుండెపోటుతో మృతి

గుంటూరులో (guntur) నిర్వహించిన SI ఫిట్‌నెస్ పరీక్షల్లో భాగంగా రన్నింగ్ ఈవెంట్లో పాల్గొన్న‌ మోహన్ అనే అభ్యర్థి సొమ్మసిల్లి పడిపోయాడు. హాస్పిట‌ల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మోహ‌న్ గుండెపోటుతో చ‌నిపోయాడ‌ని తెలిపారు.