ఓటు నీకే వేసా.. నాకు వ‌ధువుని వెతికిపెట్టు

a man asks uttar pradesh mla to find a bride for him

Uttar Pradesh: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కి చెందిన ఓ ఎమ్మెల్యేకు వింత అనుభ‌వం ఎదురైంది. త‌న‌కు ఓటేసి గెలిపించిన వారిలో ఓ వ్య‌క్తి త‌న ముందుకొచ్చి వ‌ధువుని వెతికి పెట్టు అని డిమాండ్ చేయ‌డంతో అత‌ను కంగుతిన్నాడు. ఛ‌ర్కారీ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు బ్రిజ్‌భూష‌ణ్ రాజ్‌పుత్. ఇత‌ను నిన్న స్థానిక పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకునేందుకు కారు ఆపాడు.

బ్రిజ్‌భూష‌ణ్ కారుకి పెట్రోల్ కొట్టిన అఖిలేంద్ర అనే వ్య‌క్తి త‌న బాధ‌ను ఎమ్మెల్యేను చెప్పుకున్నాడు. “” న‌మ‌స్తే సార్. మీకు ఓట్లేసి గెలిపించిన వారిలో నేను కూడా ఉన్నాను. మీరు ఎమ్మెల్యేగా గెల‌వ‌డానికి నేను కూడా ఒక కార‌ణ‌మే కాబ‌ట్టి నాకు మీరు ఓ సాయం చేయాలి. నేను కర్వాచౌత్ నాడు పుట్టాను స‌ర్. కానీ ఈ క‌ర్వాచౌత్‌కి నా కోసం ఉప‌వాసం చేసే భార్య లేదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీకు నేను ఓటేసాను కాబ‌ట్టి మీరు నాకు అమ్మాయిని చూసిపెట్టండి ప్లీజ్ “” అని అడిగాడు దాంతో బ్రిజ్‌భూష‌ణ్ ముందు షాక్ అయిన‌ప్ప‌టికీ.. త‌ప్ప‌కుండా చూస్తాను అని మాటిచ్చారు. అంతే కాదు.. అఖిలేంద్ర‌తో ఫోటో దిగి దానిని సోష‌ల్ మీడియాలో కూడా పోస్ట్ చేసారు.