లైవ్‌లో ఒళ్లు విరుచుకున్న యాంక‌ర్..వీడియో వైర‌ల్

Hyderabad: లైవ్‌లో(live) మాట్లాడుతున్న‌ప్పుడు యాంక‌ర్లు(anchor) చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏమాత్రం త‌ప్పు జ‌రిగినా ఉద్యోగం పోతుంది. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఓ బీబీసీ(bbc) యాంక‌ర్(anchor) లైవ్ ఆన్‌లో ఉన్న సంగ‌తి మ‌ర్చిపోయి చేసిన ప‌ని తెగ వైర‌ల్ అవుతోంది. లుక్వేసా బురాక్ అనే మ‌హిళ బీబీసీ యాంక‌ర్‌గా(bbc anchor) ప‌నిచేస్తోంది. న్యూస్ చ‌దివాక లైవ్ ఆఫ్‌లో ఉంద‌నుకుని ఒళ్లు విరుచుకుంది. తీరా చూస్తే లైవ్ ఆన్‌లో ఉంది. దాంతో అయ్యో అంద‌రూ చూసేసారు అన్న‌ట్లు ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్ న‌వ్వులు పూయిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వీడియోని 9 ల‌క్ష‌ల మందికి పైగా చూసారు. ఆమె ఎక్స్‌ప్రెష్స్‌కి న‌వ్వ‌లేక చ‌చ్చాం అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.