విద్యార్ధుల‌కు మ‌ద్యం కొనిచ్చి.. వారితో శృంగారం

Viral News: అమెరికాలో టీచ‌ర్ల వ్య‌వ‌హారంపై హై టెన్ష‌న్ నెల‌కొంది. అక్క‌డి స్కూళ్ల‌లోని టీచ‌ర్లు విద్యార్ధుల‌తో అక్ర‌మ సంబంధాలు పెట్టుకుంటూ వారి చేత మ‌ద్యం తాగించి అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారు. దాంతో త‌ల్లిదండ్రులు టీనేజ్ పిల్ల‌ల‌ను స్కూల్‌కి పంపించాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఇలాంటి ప‌నులు ఎక్కువ‌గా ఆడ టీచ‌ర్లే చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

దాదాపు మూడు నుంచి నాలుగు నెల‌ల కాలంలోనే టీచ‌ర్లు విద్యార్ధుల‌తోనే శృంగారం చేస్తూ దొరికిపోయిన ఘ‌ట‌న‌లు దాదాపు ప‌ది నుంచి 20 వ‌ర‌కు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా న్యూయార్క్‌లోని లూసియానా ప్రాంతానికి చెందిన ఓ టీచ‌ర్ త‌తంగం వెలుగులోకి వ‌చ్చింది. అలెక్సా అనే 35 ఏళ్ల మ‌హిళ‌ లూసియానాలోని ఓ హై స్కూల్‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తోంది. ఈమె విద్యార్ధుల ఫోన్ నెంబ‌ర్లు తీసుకుని వారికి త‌న న‌గ్న ఫోటోలు పంపుతూ వారిని రెచ్చ‌గొట్టే ప్ర‌యత్నం చేసింది. వారికి మాయ‌మాట‌లు చెప్పి ఇంటికి పిలిపించుకుని ఏకంగా మ‌ద్యం అల‌వాటు చేసేసింది. త‌న ఇంటికి వ‌చ్చిన విద్యార్ధుల్లోని ఒక‌రితో సెక్స్ కూడా చేసింది.

అలెక్సా చేస్తున్న ప‌నుల‌ను గ‌మ‌నించిన ఇత‌ర విద్యార్ధులు వెంట‌నే స్కూల్ యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేయ‌డంతో ఆమె వికృత చేష్ట‌లు బ‌య‌ట‌పడ్డాయి. వెంట‌నే ఆమెను ఉద్యోగం నుంచి తొల‌గించ‌డ‌మే కాకుండా స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. పోలీసులు అలెక్సా ఫోన్‌ను చెక్ చేయ‌గా ఆరోప‌ణ‌లు నిరూపితం అయ్యాయి. ప్రస్తుతం అలెక్సా పోలీస్ క‌స్ట‌డీలో ఉంది.