Ayodhya: తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు..!
Ayodhya: నేడు అయోధ్యలో రామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాముడి విగ్రహం గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
*ఈ అయోధ్య రామ మందిరాన్ని మొత్తం 2.7 ఎకరాల్లో నిర్మించారు.
*మందిర పొడవు 161 అడుగులు. మూడు అంతస్తుల వరకు ఉంటుంది ఈ ఆలయం. ఒక్కో ఫ్లోర్ పొడవు 20 అడుగులు ఉంటుంది. (ayodhya)
*ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా స్టీల్ కానీ ఐరన్ కానీ వాడలేదు. సాంప్రదాయ కట్టడాలకు ఉపయోగించే వస్తువులనే వాడి ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం.
*రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన భాన్సీ పాహర్‌పూర్ పింక్ సాండ్ స్టోన్‌ను ప్రత్యేకంగా తెప్పించి కట్టించారు.
*ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుకపై శ్రీ రాం అని రాసి ఉంటుంది. రామ సేతు రాళ్లనే ఈ ఆలయాన్ని నిర్మించేందుకు వాడారని తెలుస్తోంది. (ayodhya)
*నేపాల్‌లోని గందకి నదిలో లభించిన సాలిగ్రామ రాయిని నిర్మాణంలో వాడారు.
*శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం విలువ రూ.1800 కోట్ల వరకు ఉంటుంది. 2020 నుంచి 2023 వరకు ఈ ఆలయ నిర్మాణానికి అయిన ఖర్చు రూ.900 కోట్లు.