Fake AI ఫొటోతో 500 బిలియన్ డాలర్ల నష్టం..!
Hyderabad: ఒక్క ఫేక్ ఏఐ (fake ai) ఫొటో ఏకంగా 500 బిలియన్ డాలర్ల నష్టం కలిగించింది. ఇంతకీ ఏంటా ఫొటో అంటే.. అమెరికాలోని (america) డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌క్వార్టర్స్ అలియాస్ పెంటగాన్ (pentagon) వద్ద ఓ బాంబు పేలినట్లుగా ఉన్న ఫొటో. నిజానికి అక్కడ ఎలాంటి పేలుడు జరగలేదు. ఓ ఆకతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఫొటోను క్రియేట్ చేసి పెంటగాన్ వద్ద బ్లాస్ట్ జరిగింది అని ట్విటర్‌లో పోస్ట్ చేసేసాడు. పైగా అతని ట్విటర్ ఖాతాకు బ్లూ టిక్ ఉండటంతో అఫీషియల్ సమాచారం అయివుంటుందని పొరబడ్డారు. ఈ ఒక్క ఫొటో కారణంగా అమెరికా స్టాక్‌మార్కెట్ S&P 500 30 పాయింట్లకు పడిపోయింది. దాంతో 500 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఆ తర్వాత అమెరికన్ వెబ్‌సైట్స్ అది ఫేక్ ఫొటో అని చెప్పడంతో అక్కడి స్టాక్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది.
దాంతో ఇప్పుడు అంతా ట్విటర్ (twitter) సీఈఓ ఎలాన్ మస్క్‌పై (elon musk) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం ప్రతి ఒక్కరికీ బ్లూ టిక్స్ ఇచ్చేయడంతో మున్ముందు మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, బ్లూ టిక్ ఉంటే అది వెరిఫైడ్ అని పొరబడి ప్రజలు తప్పుడు వార్తలను కూడా నమ్మేస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మస్క్ ఈ బ్లూ టిక్‌పై తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.