ప్రియాంక చోప్రా ఫోటో పెట్టి.. కాంగ్రెస్‌కు ఓటేసానంటూ యువ‌తి స్కాం

Congress: మ‌రీ ఇంత మోసమా? ఇంత దిగ‌జారుడుత‌న‌మా? పై ఫోటోలో క‌నిపిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా (priyanka chopra) అని మ‌న‌కు తెలిసిందే. ఈరోజు తెలంగాణ‌లో పోలింగ్ జ‌రుగుతుంటే ఎక్క‌డో అమెరికాలో ఉన్న ప్రియాంక చోప్రా ఓటు ఎలా వేసింది అనుకుంటున్నారా? ఇది ఫేక్. ఆ ఫోటో ప్రియాంక చోప్రాదే కానీ.. వీణా జైన్ అనే ఓ నెటిజ‌న్ ప్రియాంక ముఖం క‌నిపించ‌కుండా కేవ‌లం సిరా ఉన్న వేలి ఫోటోను పోస్ట్ చేస్తూ.. దేశాన్ని స‌రైన మార్గంలో నడిపించే కాంగ్రెస్‌కే ఓటు వేసాను అని ట్వీట్ చేసింది. ఆ ఫోటోలో ప్రియాంక పెదాలు క‌నిపిస్తుండ‌డంతో అస‌లు ఫోటో బ‌య‌ట‌ప‌డింది. దాంతో అది ఫేక్ అకౌంట్ అని ఓటు వేయ‌క‌పోయినా కాంగ్రెస్‌కు వేసాన‌ని చెప్పుకుంటోంద‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.