5 మంది భార్యలు.. ఎదురు కట్నం ఇచ్చి ఆరో పెళ్లికి సిద్ధం..!
Marriage: అతనికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఆరో పెళ్లికి సిద్ధమయ్యాడు. పైగా ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుంటానంటున్నాడు.
అసలు మ్యాటర్ ఏంటంటే.. బ్రెజిల్‌కి చెందిన వనూసా ఫ్రీటాస్ అనే ఇన్ఫ్లుయెన్సర్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇటీవల దుబాయ్ ట్రిప్‌కి వెళ్లారు. వనూసాను చూడగానే ఓ వ్యక్తి వెళ్లి నేరుగా పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేసాడు. అంతేకాదు.. తనను పెళ్లి చేసుకుంటే 300 ఒంటెలు, రూ.17 లక్షల నగదు కానుకగా ఇస్తానన్నాడు. అతనికి ఆల్రెడీ ఐదు సార్లు పెళ్లి అయిందని తెలిసి వనూసా వెంటనే నో చెప్పేసింది. డబ్బున్నంత మాత్రాన విలువల్ని పక్కనపెట్టి ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోలేనని చెప్పింది వనూసా. అయితే పెళ్లికి నో చెప్పినప్పటికీ అతనికి మంచి స్నేహితురాలిగా ఉంటానంటోంది. ఈ విషయాన్ని వనూసా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించడంతో ఫ్యాన్స్ ఆమెను మంచి పని చేసావంటూ తెగ పొగిడేస్తున్నారు.