America: తెలుగ‌మ్మాయి చ‌నిపోతే US పోలీస్ వెకిలి న‌వ్వులు

అమెరికాలో (america) జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌న తెలుగమ్మాయి చ‌నిపోతే.. ఓ పోలీస్ వెకిలి న‌వ్వులు న‌వ్వుతున్న ఆడియో ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో పోలీస్ ప్యాట్రోల్ కారు ఢీకొనడంతో జాహ్న‌వి కందుల అనే క‌ర్నూలుకు చెందిన యువ‌తి దుర్మ‌ర‌ణం చెందింది. ఆ స‌మయంలో సియాటిల్‌కి చెందిన డానియ‌ల్ ఆడెర‌ర్ అనే పోలీస్ అధికారి న‌వ్వుతూ.. ఇది త‌న‌కు జ‌ర‌గాల్సిందే అన‌డం త‌న బాడీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ ఆడియో టేప్ బ‌య‌టికి రావ‌డంతో సియాటిల్ పోలీసుల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది. యాక్సిడెంట్ జ‌రిగిన‌ప్పుడు వెంటనే ఆ అమ్మాయికి ఏమైందో అని కూడా చూడ‌కుండా.. కాసేపు ఆగి న‌వ్వుకుంటూ.. చ‌నిపోయింద‌ని ఆ అధికారి అర‌వ‌డం మొత్తం ఆ బాడీ కెమెరాలో రికార్డ్ అయింది.  (america) ఈ విష‌యం కాస్తా సియాటిల్ క‌మ్యూనిటీ పోలీస్ క‌మిషన్ వ‌ద్ద‌కు వెళ్ల‌డంతో వాళ్లు వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించారు. సంబంధిత అధికారిపై త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.