Viral News: ఇంకోసారి జాబ్‌కి అప్లై చేస్తే బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం.. కంపెనీ ఓవరాక్షన్
Viral News: మీరు ఏదన్నా కంపెనీలో ఓ పోస్ట్‌కి అప్లై చేసుకున్నారనుకోండి.. వారికి మీ అనుభవం, స్కిల్స్ నచ్చితే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఒకవేళ మీరు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోతే మర్యాదపూర్వకంగా మీకు మెయిల్ ద్వారా తెలియజేస్తారు. కానీ అమెరికాకు చెందిన ఎలీట్ సాఫ్ట్‌వేర్ ఆటోమేషన్ అనే ఐటీ సంస్థ ఏం చేసిందో తెలుసా?
పాపం ఓ వ్యక్తి ఫ్రంటెండ్ టెస్టింగ్ పోస్ట్‌కి అప్లై చేసుకోవడంతో ఆ కంపెనీ రాత పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షలో సదరు వ్యక్తి తక్కువ స్కోర్ చేసాడు. దాంతో ఉద్యోగం రాలేదు. మీరు ఎంపిక కాలేదు అని మర్యాదపూర్వకంగా తెలియజేయాల్సిందిపోయి ఓవరాక్షన్ చేసారు. ఆ వ్యక్తికి 400 అక్షరాలు కలిగిన మెయిల్ రాస్తూ పాపం అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసారు. ఇంతకీ ఆ మెయిల్‌లో ఏం రాసారో తెలుసా?
“” మీరు రాత పరీక్షలో ఫెయిల్ అయ్యారు. మరో సంవత్సరం వరకు మా కంపెనీలో ఏ పోస్ట్‌కి కూడా అప్లై చేయకండి. ఒకవేళ చేస్తే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సి వస్తుంది. రాత పరీక్ష సరిగ్గా రాయలేనప్పుడు మా మీద పడి ఏడవకండి. మీ నైపుణ్యాలను పరీక్షించుకుని ఎప్పటికప్పుడు మెరుగవ్వడానికి ప్రయత్నించండి. అంతేకానీ ఒంట్లో బాలేదు అందుకే పరీక్ష సరిగ్గా రాయలేకపోయాను వంటి కుంటి సాకులు చెప్పకండి. ఈ మెయిల్ చదివాక అయినా మీలో మార్పు వస్తుందని కోరుకుంటున్నాం “” అని దురుసుగా మెయిల్ పెట్టింది. ఆ వ్యక్తి ఈ మెయిల్ ఫోటోలను రెడిట్ యాప్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు ఆ కంపెనీపై నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నారు.