Lay Off: అబ్బా.. ఎంత మంచి కంపెనీ..!
Bengaluru: రిసెషన్ వల్ల ఎన్నో కంపెనీలు ఉద్యోగుల్ని అర్థాంతరంగా తీసేస్తున్నాయి (lay off). ఇంకొన్ని కంపెనీలు జీతాలు ఇవ్వలేక బోర్డులు తిప్పేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ కంపెనీ (company) ఏం చేసిందో తెలుసా? సంభవ్ జైన్, ఖుష్ తనేజా అనే ఇద్దరు వ్యక్తులు బెంగళూరులో (bengaluru) ఫ్యామ్ (fam) అనే ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ పెట్టారు. కానీ ప్రస్తుతం కంపెనీ అంత లాభదాయకంగా లేకపోవడంతో ఉన్న 50 మంది ఉద్యోగుల్లో 18 మందిని తీసేసారు.
కానీ ఉద్యోగం నుంచి తీసేస్తే (lay off) ఆ బాధ ఎలా ఉంటుందో వారికీ తెలుసు కాబోలు. పాపం ఆ ఉద్యోగులను అలా వదిలేయకుండా వారి నుంచి రెస్యూమ్‌లు, సీవీలు తీసుకుని వాళ్లే వేరే కంపెనీల్లో ఉద్యోగాలు వెతికిపెడుతున్నారట. కుదిరితే రిఫరెన్స్‌లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగుల్ని ఉన్నట్టుండి తీసి మీ చావు మీరు చావండి అని కొన్ని కంపెనీలు చేతులు దులిపేసుకుంటున్న ఈ రోజుల్లో ఇలా మానవత్వంలో ఆలోచిస్తున్నారు ఇద్దరు యువకులు. నిజంగా గ్రేట్ కదా..!