Pizza: కస్టమర్ కోసం రూ.1.63 లక్షల విలువైన పిజ్జా
Hyderabad: ఓ కస్టమర్ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.1.63 లక్షల విలువైన పిజ్జా(pizza) తయారు చేసింది ఓ చెఫ్(chef). మీరు చదివింది నిజమే. కాకపోతే.. ఆ కస్టమర్ ఓ సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ ఎవరు అనేది వెల్లడించలేదు కానీ.. వారు జస్ట్ పిజ్జా అడిగితే మార్కలు కొట్టేయడానికి కాస్ట్లీ పదార్థాలతో పిజ్జా తయారుచేసి ఇచ్చింది. ఆ పిజ్జా కోసం ఆర్గానిక్ అంజీరా పండ్లు, మష్రూం పౌడర్, ఆర్గానిక్ బాదం, గ్లూటెన్ ఫ్రీ మల్టీఫ్లోర్ కొనంది. వీటి ఖరీదు దాదాపు రూ.81,700. ఇంతటితో ఆగకుండా.. న్యూజీల్యాండ్ నుంచి ఆర్గానిక్ మనూకా తేనె తెప్పించింది. ఇక టాపింగ్స్‌కి 24 క్యారెట్ గోల్డ్ ఫ్లేక్స్ వాడి తయారుచేసింది. ఆ పిజ్జా ఫొటోలు, వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.